Breaking: తిరుమలలో భారీ వర్షం

by srinivas |
Breaking: తిరుమలలో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో భారీగా వర్షం (Rain) కురుసింది. ఉదయం 10 గంటల నుంచి కొండపై ఎండకాసినా మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమలగిరులు కనువిందు చేశాయి. చిటపట చినుకులతో ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కనిపించాయి. దీంతో భక్తులు తిరుమల అందాలను తనివితీరా ఆస్వాదించారు. తిరుమల కొండపైనే కాదు తిరుపతి పట్టణంలోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed