Kolkata doctor rape and murder: గ్యాంగ్ రేప్ జరగలేదు.. సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు

by Shamantha N |
Kolkata doctor rape and murder: గ్యాంగ్ రేప్ జరగలేదు.. సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata doctor rape and murder) కేసులో సీబీఐ సంచలన విషయం వెల్లడించింది. హత్యాచార ఘటనలో గ్యాంగ్ రేప్ జరిగిన దాఖలాలు లేవని సీబీఐ(CBI) వర్గాలు తెలిపాయి. ఆర్జీ కర్ హాస్పిటల్(RG Kar Hospital) లో ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్(Gang-Rape) జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని సీబీఐ విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు నిర్ధారించాయి. అలాగే దర్యాప్తు తుదిదశకు చేరుకుందని, త్వరలో కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి. తొలుత ఈ కేసును బెంగాల్‌ పోలీసులు(Kolkata Police) దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తంకావడంతో కలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఆ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ‘‘కేసు పూర్తిచేయడానికి నేను ఐదు రోజుల సమయం అడిగాను. కానీ దానిని సీబీఐకి బదిలీ చేశారు. 16 రోజులయ్యింది. న్యాయం ఎక్కడ జరిగింది? రోజులు గడుస్తున్నా న్యాయం మాత్రం లభించడం లేదు. అలాగే కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదు’’ అంటూ ఇటీవలే సీబీఐపై మమత బెనర్జీ (Chief Minister Mamata Banerjee)విమర్శలు గుప్పించింది. ఇలాంటి విమర్శలు వస్తుండటంతో ఈ వార్తలు రావడం గమనార్హం. సెప్టెంబర్ 17న కలకత్తా హైకోర్టుకు సీబీఐ స్టేటస్ రిపోర్టును దాఖలు చేయనుంది.

అసలు కేసేంటంటే?

ఇదిలాఉంటే.. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఘటన జరిగిన తెల్లారే పోలీసులు అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. పోర్న్ వీడియోలను గుర్తించారు. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్‌ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. దాని ఆధారంగానే కేసు దర్యాప్తు సాగించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed