ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థనకు సీబీఐ ఓకే

by GSrikanth |
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థనకు సీబీఐ ఓకే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం విచారణకు హాజరుకాలేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఢిల్లీ బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో ఉందని, దానిని సకాలంలో పూర్తి చేయడానికి విచారణను ఈనెలాఖరుకు వాయిదా వేసుకోవాలన్న డిప్యూటీ సీఎం అభ్యర్థనను సీబీఐ ఆమోదించింది. త్వరలో కొత్త సమన్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, బడ్జెట్‌ను రూపొందించడానికి పగలు, రాత్రి పని చేస్తున్నానని సిసోడియా అన్నారు. తనను అరెస్టు చేస్తారనే భయం లేదని, ఎలాంటి ప్రశ్నల నుండి పారిపోవడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఓడిపోయిన ఒక రోజు తర్వాత, తనను విచారణకు పిలిచారని చెప్పారు. బీజేపీ సూచన మేరకే తనకు నోటీసులు సీబీఐ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత సీబీఐ తనను అరెస్టు చేయవచ్చని సిసోడియా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed