- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi liquor scam : మనీష్ సిసోడియాకు మరోసారి CBI నోటీసు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని సోమవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతకు ముందు సీబీఐ ఫిబ్రవరి 19న సిసోడియాను విచారణకు పిలిచింది. అయితే బడ్జెట్ పనుల్లో ఉన్నందునా విచారణకు హాజరుకాలేనని, ఇందుకోసం మరికొంత సమయం కావాలని దర్యాప్తు అధికారులకు సిసోడియా ఆదివారం విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న తనకు బడ్జెట్‌ను రూపొంచించే ఈ సమయం అత్యంత కీలకమైనదని.. అందువల్ల ఈ నెల చివరి వారం తర్వాతే విచారణకు హాజరు అవుతానని సీబీని కోరారు. అయితే కొన్ని గంటల ఉత్కంఠ అనంతరం సీబీఐ మనీష్ సిసోడియా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి నోటీసులు ఇస్తూ ఫిబ్రవరి 26న విచారణకు ఆహ్వానించింది. అయితే తాను ఫిబ్రవరి చివరి వారం తర్వాతే విచారణకు హాజరవుతానని సిసోడియా చెప్పినప్పటికీ ఆలోపే సీబీఐ విచారణకు పిలవడం చర్చగా మారింది.