Accident: బీహార్‌లో ఘోర యాక్సిడెంట్ .. బస్సు-ట్రక్కు ఢీ

by Harish |
Accident: బీహార్‌లో ఘోర యాక్సిడెంట్ .. బస్సు-ట్రక్కు ఢీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. కైమూర్ జిల్లాలోని మోహనియా వద్ద బర్హౌని సేవా నికేతన్ సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని గయా నుంచి బారాబంకి వెళ్తున్న బస్సు, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి.

సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తమ వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO), మోహనియా, ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది, కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed