BSF: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు

by S Gopi |
BSF: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని స్థానికుల్లో అభద్రత భావాన్ని తొలగించేందుకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గురువారం సరిహద్దు గ్రామాల్లోని పెద్దలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. 'బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులు, ఇతర సరిహద్దు సమస్యలపై స్థానికులు, సర్పంచ్, ప్రధాన్‌ల సమక్షంలో భద్రతపై భరోసా ఇచ్చేందుకు సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో వివిధ గ్రామాలలో గ్రామ సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేశామని' సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. బుధవారం బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద రెండు సెక్టార్‌లలో గుగూడటాన్ని గమనించారు. దాంతో నిరసనకారులు దాడుల చేయవచ్చనే భయాందోళనలు పెరిగాయి. పరిస్థితిని గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై అవసరమైన చర్యలను చేపట్టింది. సరిహద్దు భద్రతపై భరోసా ఇచ్చారు. ఓ సెక్టార్‌లో, బీఎస్ఎఫ్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ), స్థానిక సివిల్ అధికారులు, గుమిగూడిన 35 మంది వ్యక్తులతో మాట్లాడి తిరిగి పంపించేశారు. మరో రెండు సెక్టార్‌లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. బీఎస్ఎఫ్ సిబ్బంది త్వరగా స్పందించి, బీజీబీ సహకారంతో గుంపును చెదరగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed