పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలని యడియూరప్ప పిటిషన్

by Harish |   ( Updated:2024-06-28 09:26:19.0  )
పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలని యడియూరప్ప పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పోక్సో చట్టం కింద తనపై నమోదైన బాలలపై లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోక్సో కేసులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో యడియూరప్పపై పోలీసులు ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో, శుక్రవారం ఆయన కేసును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఆయనపై పోక్సో చట్టం, సెక్షన్ 354 A కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలోక్ మోహన్ దర్యాప్తును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి బదిలీ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. నాపై కుట్ర చేస్తున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. తన కూతురిపై మాజీ సీఎం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెలలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించింది. అయితే దానికి ముందుగానే పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి జూన్ 17న యడియూరప్పను సీఐడీ మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీని అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed