- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రలో 12 జడ్పీ స్థానాలు సాధించడమే బీఆర్ఎస్ లక్ష్యం
దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన నేపథ్యంలో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న 34 జిల్లా పరిషత్‌లలో కనీసం 12 స్థానాల్లోనైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నాందేడ్ జిల్లాలోని కంధర్ లోహాతో పాటు రెండు బహిరంగ సభలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే విదర్భలో మూడో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు.
మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల 'తెలంగాణ మోడల్' పై దూకుడుగా ప్రచారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పార్టీ నాయకులను ఆదేశించారు. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఎంపిక చేసిన నాయకులతో రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు 2024 అక్టోబర్‌లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించి మహారాష్ట్రలో కార్యకలాపాలను వేగవంతం చేయడంపై వారికి ఆదేశాలు ఇస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రపైనే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రత్యుక దృష్టి సారించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలోని విదర్భ ప్రాంతంలో మరియు పశ్చిమ ప్రాంతంలోని మరో జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్ లో కూడా త్వరలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
Also Read...
బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!