- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
"నలిగిన హృదయాలు".. దేశంలో భారీగా పెరిగిన 'యూత్' సూసైడ్స్!
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్ లో ఎక్కువ మంది యువత ఆత్మహత్యలకు(suicides) పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. మంగళవారం "ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం"(World Suicide Prevention Day) సందర్భంగా.. నిపుణులు 'యువత'(youth) లో అవగాహనను పెంచడానికి, ధైర్యాన్ని నింపడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 10 వ తేదీన 'ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏటా కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ లో కౌమార దశ(15-19 ఏళ్లు) గల యువతలో 'ఆత్మహత్య మరణాలు' మానవ జీవితంలో 4 వ ప్రధాన కారణం అవుతున్నాయని వెల్లడించారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(National crime records bureau) గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే కేసులలో 40 శాతానికి పైగా.. "30 ఏళ్ల లోపు యువత" ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్లోబల్ సగటు(Global average) తో పోలిస్తే.. "దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకుల సంఖ్య దాదాపు రెట్టింపు. రోజుకు సగటున భారత్ లో సుమారు 160 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో సూసైడ్స్ చేసుకోవడం ద్వారా చనిపోయే యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది." అని ఎయిమ్స్ లోని సైకియాట్రిక్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నందకుమార్ వెల్లడించారు.
యువతలో ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉండవచ్చు..?
యువత ప్రధానంగా.. "ఒంటరితనం(loneliness), బంధాలు(రిలేషన్స్) విఫలం కావడం(relations failure), భావోద్వేగాలు నియంత్రణలో లేకపోవడం(ఉద్వేగ స్థిరత్వం లేకపోవడం)(uncontrolled emotions), కుటుంబంలో కలహాలు(ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణం), బలహీన స్నేహబంధాలు" లాంటి వివిధ కారణాలు.. యువతను బలహీనపరిచి, వారిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. National crime records bureau లెక్కల ప్రకారం.. 2022 లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలు(suicides) చేసుకున్నారు. వీరిలో "15 నుంచి 39 సంవత్సరాల వయసులోపు గల మరణాలు.. ఆత్మహత్యలు చేసుకోవడం వలన సంభవించినవే.! మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సమస్యల్లో 'ఆత్మహత్య'లు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి." అని 'లైవ్ లవ్ లాఫ్' సైకియాట్రిస్ట్, డాక్టర్ శ్యామ్ భట్ తెలిపారు. కాబట్టి ఆత్మహత్య(suicides)ల రేటుని తగ్గించడానికి యువతకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, వారి మానసిక ఆరోగ్య సంరక్షణ, యువత ఎదుర్కొంటున్న ఆర్ధిక, పలు అంతరంగ సమస్యలను కూడా పరిష్కరించడం ఎంతో అవసరమని అన్నారు. మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న యువతను అక్కున చేర్చుకొని, వారికి సరైన కౌన్సిలింగ్(counseling) ఇవ్వగలిగితే కనుక, ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనల నుంచి వారిని వీలైనంత త్వరగా బయటకి తీసుకురావొచ్చని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 'యువత'లో ఆత్మహత్యలను నివారించడానికి.. "నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మరియు కిరణ్ హెల్ప్ లైన్ లాంటి మిషన్స్" ను కూడా చేపట్టిందని, యువత లేదా మానసిక కుంగుదలకు లోనైన వ్యక్తులు ఎవరైనా సరే.. ఈ సంస్థలను ఉపయోగించుకోవాలని.. 'మనస్థలి' వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి ఈ సందర్భంగా వెల్లడించారు.