King Charles III: భారత్ లో బ్రిటన్ కింగ్ ఛార్లెస్ దంపతులు..!

by Shamantha N |
King Charles III: భారత్ లో బ్రిటన్ కింగ్ ఛార్లెస్ దంపతులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3(King Charles III) సీక్రెట్ ట్రిప్ కోసమని భారత్ వచ్చారు. ఆయన సతీమణి క్వీన్‌ కెమిల్లా(Queen Camilla) తో కలిసి కింగ్ ఛార్లెస్ ఇండియా వచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్టోబరు 27 నుంచి వారిద్దరూ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి ఓ వెల్‌నెస్‌ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ కింగ్ కపుల్ వెల్‌నెస్‌ కేంద్రంలో యోగా, మెడిటేషన్‌ సాధనలో సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా వీరు బుధవారం బెంగళూరు నుంచి బ్రిటన్‌ బయలుదేరనున్నట్లు సమాచారం.

కామన్వెల్త్ సదస్సు నుంచి నేరుగా..

అయితే, కింగ్ చార్లెస్ -3 దంపతులు అక్టోబర్ 21- 26 మధ్య కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు సీక్రెట్ గా వచ్చారు. సీక్రెట్‌ ట్రిప్‌ కావడంతో ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించలేదు. బెంగళూరులోని వెల్‌నెస్‌ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బంది వారికి వివిధ థెరపీ సెషన్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. కింగ్ ఛార్లెస్‌-3ను బ్రిటన్ రాజుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ కు రావడం ఇదే తొలిసారి. అయితే ఆయన వేల్స్ ప్రిన్స్ గా ఉన్న సమయంలో పలుమార్లు బెంగళూరులోని వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చేవారు. 71వ పుట్టిన రోజును కూడా ఇండియాలోనే జరుపుకున్నారు. 2022లో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత ఛార్లెస్‌ను బ్రిటన్‌కు రాజుగా ప్రకటించారు. మరోవైపు, బ్రిటన్‌ రాజదంపతులు సెంటర్‌ బెంగళూరులోని సమేతనహళ్లిలో ఉన్న సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. కింగ్ ఛార్లెస్ ఈ వెల్‌నెస్‌ సెంటర్‌కు తొమ్మిదిసార్లు వచ్చి చికిత్స చేయించుకున్నట్లుగా సమాచారం.


Advertisement

Next Story

Most Viewed