హనుమంతుడిలా.. మీ గవర్నమెంట్‌ను మళ్లీ తెచ్చుకోండి : Priyanka Gandhi

by Vinod kumar |
Priyanka Gandhi Tests Corona Positive
X

భోపాల్ : ఓటర్లంతా హనుమంతుడి పాత్రను పోషించి బీజేపీ కబంధ హస్తాలకు చిక్కిన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని విడిపించాలని మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పిలుపునిచ్చారు. ‘‘మాయావి రూపంలో వచ్చిన రావణుడు.. రామలక్ష్మణులను మోసగించాడు. మీరు కూడా 2018లో అలాగే మోసపోయారు. ఆ ఏడాది మీ ఓట్లతో ఏర్పడిన కాంగ్రెస్ సర్కారును మాయావి రూపంలోని రావణుడి తరహాలో బీజేపీ హైజాక్ చేసింది. ఈసారి మీరంతా హనుమంతుడి స్ఫూర్తితో ఓట్లువేసి మళ్లీ మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకోండి’’ అని ఆమె ప్రజలను కోరారు.

బుధవారం మధ్యప్రదేశ్‌లోని సాన్వర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో 2020లో మధ్యప్రదేశ్‌లోని హస్తం పార్టీ ప్రభుత్వం కూలిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గత మూడేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు.

Advertisement

Next Story