ఫస్ట్ నైట్ రోజే దారుణం.. బెడ్ రూమ్‌లో అలా పడి ఉన్న వధూవరులు

by samatah |
ఫస్ట్ నైట్ రోజే దారుణం.. బెడ్ రూమ్‌లో అలా పడి ఉన్న వధూవరులు
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా మూడు ముళ్లబంధంతో ఒకటైన జంట, శోభనం రోజు అనుమానాస్పదంగా మరణించారు. వివరాల్లోకి వెళ్లితే.. గోధియా గ్రామానికి చెందిన ప్రతాప్ యాదవ్ (24),పుష్ప యాదవ్ (22) మంగళవారం ఘనంగా బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాగా , వీరికి గురువారం రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. దీంతో అదే రోజు వారు తమ గదిలో విగతజీవులుగా కనిపించారు. దీంతో వీరి మృతిపై పలు అనుమాలు వ్యక్తంకాగా, గతంలో వారికి అనారోగ్య సమస్యలు ఏమీ లేవని, గదిలో వెంటిలేషన్ లేకపోవడం వలన ఊపిరాడక గుండెపోటుతో చనిపోయారని, పోలీసులు చెప్పారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story