- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఆప్ నేతల్లో టెన్షన్.. టెన్షన్..! కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఈ మేరకు కేజ్రీ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కేసులో కేజ్రీవాల్ అత్యంత కీలకంగా వ్యహరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. స్కాంలో కీలక నిర్ణయాలు, నగదు లావాదేవీలు అన్ని ఆయన ఆదేశాల మేరకే జరిగాయంటూ ఆక్షేపించింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదంటూ ఆరోపణలు గుప్పించింది. కేసులో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఒక వేళ బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. కాగా, ఆగస్టు 14న చివరి విచారణలో భాగంగా కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసు జారీ చేసింది. ఆగస్టు 23 లోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరింది.