బ్రేకింగ్ : మూడు రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్ఐఏ దాడులు..

by Sathputhe Rajesh |
బ్రేకింగ్ : మూడు రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్ఐఏ దాడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏకకాలంలో బుధవారం 60 చోట్ల దాడులు చేపట్టింది. కేరళ, కర్నాటక, తమిళనాడులో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఐసీస్ సానుభూతి పరుల ఇళ్లలో ఈ తనిఖీలను అధికారులు చేపట్టారు. కోయంబత్తూర్, మంగళూరు బాంబు పేలుళ్ల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

కాగా గతేడాది అక్టోబర్ 23న జమేషా ముబీన్ అనే అనుమానిత టెర్రరిస్ట్ కారులో గ్యాస్ సిలిండర్ పేలి సున్నిత ప్రాంతమైన కొట్టాయ్ ఈశ్వరన్ గుడి ఎదుట చనిపోయాడు. అనంతరం పోలీసులు అనుమానిత తీవ్రవాది ఇంట్లో నుంచి 75 కిలో పేలుడు పదార్థాలు, కీలక పత్రాలు, ఐసిస్ జెండాను స్వాధీన పరుచుకున్నారు. అనంతరం ఆ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు టెర్రరిస్ట్ కార్యకలాపాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి దాడులు చేస్తున్నారు.

Advertisement

Next Story