BREAKING: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌)‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

by Shiva |   ( Updated:2024-02-06 15:49:24.0  )
BREAKING: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌)‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను కేంద్ర మంత్రి జితేంద్ర‌సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లులో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలు పాల్పడిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.ఒక్క రూపాయి జరిమానాతో సహా కఠినమైన జరిమానాలు విధించననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నేరాలను అరికట్టేందుకు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన చట్టం తేదని పేర్కొన్నారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌)బిల్లును ప్రవేశ పెట్టిందని తెలిపారు. బిల్లులో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడితే, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, రీసోర్స్‌, సిస్టమ్‌ను ట్యాంపర్‌ చేసిన వ్యక్తులు, సంస్థలను కఠినంగా శిక్షించనున్నారు. అదేవిధంగా నకిలీ వెబ్‌సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ, ప్రవేశ పరీక్షలు, నకిలీ అడ్మిట్‌ కార్డులు, నకిలీ ఆఫర్‌ లెటర్లు, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం లాంటివి చేసినా.. గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు.

స్కాంలో ప్రమేయం ఉన్నా వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలు, వ్యాపార సంస్థలు, సబ్‌ కాంట్రాక్టర్‌కు రూ.1కోటి జరిమానా విధించనున్నారు. ఇక యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో అక్రమాలకు పాల్పడితే పై శిక్షలు విధించనున్నారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ కూడా బిల్లులోని నియమ నిబంధనలు వర్తించనున్నాయి. ప్రభుత్వ పోస్టుల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం పరిధిలోకి రానున్నారు.

Advertisement

Next Story

Most Viewed