BREAKING : జ్ఞాన్‌వాపి ఏఎస్ఐ సర్వే రిపోర్టు విడుదల.. సంచలన విషయాలు వెలుగులోకి

by Shiva |   ( Updated:2024-01-25 16:41:49.0  )
BREAKING : జ్ఞాన్‌వాపి ఏఎస్ఐ సర్వే రిపోర్టు విడుదల.. సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్ వెబ్‌డెస్క్: జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వేకు సంబంధించి సీల్డ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే విషయంపై ఇటీవలే వారణాసి జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సర్వే రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. అదేవిధంగా కేసులోని ఇరు పక్షాలకు నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను విడుదల చేసింది. అయితే, ఆ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జ్ఞాన్‌వాపి మసీదు కింది భాగంలో అతి పెద్ద ఆలయ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. తెలుగు భాషతో పాటు మొత్తం 32 కీలక శాసనాధారాలు ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి. అదేవిధంగా 17వ శతాబ్ధంలో ఆలయాన్ని కూల్చి అదే ప్రాంతంలో మసీదును నిర్మించినట్లుగా సర్వే రిపోర్టులో వెల్లడైంది. ఆలయ స్థంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించినట్లుగా తేలింది. ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం మసీదు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story