కాలేజీలో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా విద్యార్థుల పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు

by S Gopi |
కాలేజీలో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా విద్యార్థుల పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై కాలేజీ క్యాంపస్‌ల్ హిజాబ్, నిఖాబ్, బుర్ఖా, స్టోల్స్, క్యాప్ మొదలైన వాటిపై నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ మహిళా విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్, రాజేష్ పాటిల్ డివిజన్ బెంచ్ తొమ్మిది మంది విద్యార్థినుల పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యాసంవత్సరానికి చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కళాశాల విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేసింది. ఇందులో భాగంగా బురఖాలు, నిఖాబ్‌లు, హిజాబ్‌లు లేదా బ్యాడ్జ్‌లు, క్యాప్‌లు లేదా స్టోల్స్ వంటి ఏదైనా మతపరమైన ఐడెంటిఫైయర్‌లను కాలేజీ లోపల అనుమతించబోమని యాజమాన్యం పేర్కొంది. అబ్బాయిలకు పూర్తి లేదా హాఫ్ షర్టులు, ప్యాంటు మాత్రమే సూచించబడ్డాయి. అయితే అమ్మాయిలు కాలేజీ క్యాంపస్‌లో "ఏదైనా భారతీయ/పాశ్చాత్య నాన్-రివీలింగ్ డ్రెస్ ధరించవచ్చు. దీనిపై జూలైలో సైన్స్ డిగ్రీ కోర్సు చేస్తున్న రెండో, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తమ మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కు, గోప్యత హక్కు, ఎంపిక చేసుకునే హక్కుకు విరుద్ధంగా కాలేజీ ఆదేశాలు ఉన్నాయి. ఈ చర్యలు ఏకపక్షమని, అసమంజసమని, చట్టవిరుద్ధమని, దుర్మార్గమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కాలేజీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ, రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed