- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Bomb Threat: విస్తారా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. హుటాహుటిన దారి మళ్లింపు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫ్లైట్లు, ట్రైన్లలో బాంబులు పెట్టామంటూ పోలీసులు, భద్రతా దళాలకు సవాలు విసురుతున్నారు. గత నాలుగు రోజుల వ్యవధిలో ఆగంతకులు ఇలా 35 ఫేక్ కాల్స్ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్‌లో బాంబులు పెట్టినట్లుగా ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం వారు ఫ్లైట్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు. అయితే, అక్కడ భద్రతా ఏజెన్సీ నుంచి పూర్తి అనుమతులు వచ్చాకే ఫ్లైట్ అక్కడి నుంచి బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది.