- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక గాంధీపై పోటీకి బీజేపీ యువ నాయకురాలు నవ్య హరిదాస్ ఖరారు
దిశ, వెబ్ డెస్క్ : వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై కేరళ బీజేపీ యువ నేత, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత సత్యన్ మొఖేరీ పోటీలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ సాగనుందని అంచనా వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఆ తరువాత రాయ్‌బరేలీ సీటులో కొనసాగాలని నిర్ణయించుకుని, వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబరు 23న ఫలితం తేలిపోనుంది. అక్టోబరు 23న యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ నవ్య హరిదాస్ !
వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఎవరన్న చర్చ జోరందుకుంది. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న 39ఏండ్ల నవ్య హరిదాస్ కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కోజీకోడ్ కార్పొరేషన్లో బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. వరుసగా ఆమె రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకు పడే నవ్య హరిదాస్ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయారు. తాజాగా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక మేరకు నవ్యపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టమైంది.
కాగా వయనాడ్ ఎన్డీఏ అభ్యర్థిగా తనను ప్రకటించిన గంటల వ్యవధిలోనే నవ్య హరిదాస్ కాంగ్రెస్‌పై పదునైన విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం వయనాడ్‌ను కేవలం సెకండ్ ఆప్షన్‌గా పరిగణిస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని వయనాడ్ ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమకు అండగా ఉండి, సమస్యలు పరిష్కరించే నాయుకుడినే కోరుకుంటున్నారని తెలిపారు. కోజీకోడ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌పై నవ్య తనదైన శైలిలో విమర్శలు సంధించారు. వయనాడ్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో విఫలమైన గాంధీ కుటుంబానికి ప్రతినిధిగా ప్రియాంక వస్తున్నారని, వయనాడ్ ప్రజలు వచ్చే ఐదేళ్ల పాటు రాహుల్ గాంధీ తమ వెంట ఉంటారనే నమ్మకంతో ఆయనకు ఓట్లేశారని, కానీ రాయబరేలీని ఆయన ఎంచుకుని, వయనాడ్‌ను వదిలేశారని నవ్య హరిదాస్ విమర్శించారు.