- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జనవరి 30వ తేదీలోపు కార్యాలయాలు ఏర్పాటు పూర్తవ్వాలని రాష్ట్ర యూనిట్లకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పోటీలో ఉంటే అభ్యర్థుల పేర్ల ప్రకటనకు ముందే ఎన్నికల కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించింది.
అంతేకాదు.. లోక్‌సభ నియోజకవర్గంలో కొత్త ఏర్పాటు చేయబోయే ఆ పార్టీ కార్యాలయం నుంచే ఎన్నికల వ్యూహాలు, ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ప్రచారంలో భాగంగా బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు, వాహనాల ఖర్చును వీలైనంత తగ్గించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా, లోక్‌సభ ఎన్నికలను బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలోనూ పదికి తగ్గకుండా సీట్లు గెలవాలని నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.