దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదపై బీజేపీ ఫోకస్.. తెలంగాణలో 50 లక్షల టార్గెట్

by Mahesh |   ( Updated:2024-08-17 08:20:09.0  )
దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదపై బీజేపీ ఫోకస్.. తెలంగాణలో 50 లక్షల టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ పలు స్థానాలను కోల్పోయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ.. సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభం అయిన ఈ భేటికి..పార్టీ జాతీయ పదాధికారులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల టార్గెట్..

అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలతో గతంతో పోలిస్తే.. మంచి ఓటు శాతం దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. దీంతో రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది స్థానాలతో పాటు పలు పార్లమెంట్ సెగ్మంట్లలలో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. దీంతో 2029 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుని బీజేపీ వ్యూహాలు పన్నుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలను నమోదు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కాగా ఈ బీజేపీ సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా 5, 6 నెలల పాటు కొనసాగనుంది.

Advertisement

Next Story

Most Viewed