సంచలన ఆరోపణలు చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్

by Shamantha N |
సంచలన ఆరోపణలు చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సంచల ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల తొలిదశలో ఫోలింగ్ లో భాగంగా అన్నామలే కరూర్ లోని ఉత్తుపట్టిలో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత డీఎంకే, ఏఐడీఎంకేపై ఆరోపణలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐడీఎంకే రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చుచేశాయని ఆరోపణలు చేశారు.

అయితే, తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కోయంబత్తూరు లోక్ సభ స్థానానికి బీజేపీ చీఫ్ అన్నామలై పోటీ చేస్తున్నారు. అదే స్థానానికి డీఎంకే నుంచి గణపతి పి. రాజ్ కుమార్, ఏఐడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని.. విపక్షాలు ఒక్కరినైనా తీసుకువస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.తమిళనాడులో బీజేపీ రెండంకెల స్థానాలు గెలుచుకుంటుందన్న అన్నామలై.. తమిళప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునకు నాంది పలుకుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇకపోతే, లోక్ సభ ఎన్నికలకు తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటువేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళిసైసౌందర్‌రాజన్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, తిరువన్మియూర్‌లో ప్రముఖ నటుడు అజిత్‌, తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఓటేశారు.చెన్నైలో తమిళనాడు సీఎంస్టాలిన్ తన భార్యతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. రాధికా శరత్ కుమార్ కుటుంబం కూడా ఓటు హక్కుని వినియోగించకుంది.

కాగా, తొలి విడుత ఎన్నికల్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా, 134 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed