ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని బీజేపీ చూస్తోంది: రాహుల్ గాంధీ

by Dishanational1 |
ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని బీజేపీ చూస్తోంది: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని చూస్తోందని, దీన్నే కాంగ్రెస్ రక్షిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. గురువారం కేరళలోని కాన్నూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. 'ఈడీ, సీబీఐని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ద్వారా బీజేపీ మన దేశ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, యూడీఎఫ్‌లు భారతదేశ వైవిధ్యాన్ని అంగీకరిస్తాయి. మన ప్రజల భిన్న భాషలు, సంప్రదాయాలు, విభిన్న చరిత్రలను అంగీకరిస్తాం. బీజేపీ ఒకే చరిత్ర, ఒకే దేశం, ఒకే భాషను ప్రజలపై రుద్దాలని భావిస్తోంది' అని విమర్శించారు. ఉదాహరణకు కేరళలోని మలయాళం భాషను తొలగిస్తే రాష్ట్రంలోని మహిలలు తమ పిల్లలకు ఈ నేల గొప్పతనాన్ని ఎలా వివరించగలరని ప్రశ్నించారు. దేశంలోని భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Next Story