- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనియా గాంధీ ఓ ‘‘విషకన్య’’.. BJP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య విమర్శల పర్వం పదునెక్కుతోంది. ప్రధాని మోడీని ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియాని విషయ కన్యగా అభివర్ణించాడు. దీంతో బసనగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన వ్యాఖ్యలు సోనియా గాంధీని మాత్రమే కాదు యావత్ మహిళలను అవమానించేదిగా ఉందని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మహిళల పట్ల గౌరవం ఉంటే బసనగౌడ పాటిల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీని విషనాగు అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. తాను మోడీని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలను మాత్రమే నేను విష సర్పం వంటిదనే ఉద్దేశంలో అన్నానని వివరణ ఇచ్చారు.
Also Read..