- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ మేనిఫెస్టో దేశాభివృద్ధికి బ్లూ ప్రింట్: యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో దేశాభివృద్ధికి బ్యూ ప్రింట్ వంటిదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ అభివర్ణించారు. మోడీ హామీలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. దేశాన్ని తీర్చిదిద్దడం కేవలం బీజేపీకే సాధ్యమన్నారు. లక్నోలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడమే మోడీ హామీల లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే భావనను ముందుకు తీసుకెళ్లడమేనని తెలిపారు. మోడీ హామీలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత, మహిళలు, పేదలు, రైతుల అభివృద్ధికి బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దేశ ప్రజలకు మోడీ హామీలపై నమ్మకం ఉందని మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కాగా, సంకల్ప్ పత్ర పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే.