రాహుల్ వీడియో వివాదాస్పదం! బీజేపీ తీవ్ర ఆరోపణలు

by Disha Web Desk 14 |
రాహుల్ వీడియో వివాదాస్పదం! బీజేపీ తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీడియో తాజాగా వివాదస్పదంగా మారింది. ఈ వీడియో పై బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా మహారాష్ట్రలోని పుణెలో సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సభలో రాహుల్ గాంధీని సన్మానిస్తారు. శాలువాతో పాటు వారు చత్రపతి శివాజీ ప్రతిమను రాహల్‌కు బహుకరిస్తారు. ఈ క్రమంలోనే విగ్రహాన్ని తీసుకునే విధానంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోపై తెలంగాణ బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేసింది. ‘అడుగడుగునా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తోసివేసిన రాహుల్ గాంధీ, హిందూ హృదయ సామ్రాట్ గా ఆరాధించే ఛత్రపతి శివాజీ ప్రతిమతో ఫోటో దిగడానికి కూడా రాహుల్ గాంధీకి అంత ఇబ్బంది ఎందుకు’ అని బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం బీజేపీ ఆరోపణలను ఖండించింది.

Next Story

Most Viewed