- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12వ జాబితా రిలీజ్ చేసిన బీజేపీ..4 రాష్ట్రాల్లోని 7 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు గాను బీజేపీ 12వ జాబితాను మంగళవారం రిలీజ్ చేసింది. ఇందులో మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానం నుంచి ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లే, పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి మంజీత్ సింగ్ మన్నా, హోషియార్‌పూర్ నుంచి అనితా సోమ్ ప్రకాష్, భటిండా నుంచి పరంపల్ కౌర్ సింధులను బీజేపీ బరిలోకి దింపింది. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా నుంచి శశాంక్ త్రిపాఠి, పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుండి అభిజిత్ దాస్‌ను ప్రకటించింది. అలాగే ఒడిశా అసెంబ్లీకి 21 మంది, తెలంగాణకు 1, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 4 మంది అభ్యర్థుల పేర్లను కూడా బీజేపీ వెల్లడించింది.