మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

by Y. Venkata Narasimha Reddy |
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్రపక్షాలతో కలిసి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ముందుకెలుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తుంది. బీజేపీ కోర్ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలు భేటీ నిర్వహించి ముందుగా వివాదం లేని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని బీజీపీ నాయకత్వం యోచిస్తుంది. 50 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గా్ల్లో చర్చ సాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సగానికి పైగా స్ధానాల్లో బీజేపీ పోటీకి సిద్దమవుతుంది. రాబోయే వారం రోజుల్లో బీజేపీ, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ 150 నుంచి 160 సీట్లలో పోటీ చేయనుంది. అదే జరిగితే ఎన్‌సీపీ, శివసేనకు 128-138 సీట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ చివరి వరకు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed