147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డు సాధించిన జైశ్వాల్

by Harish |
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డు సాధించిన జైశ్వాల్
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాపై 56 పరుగులు చేయడంతో అతను సొంతగడ్డపై మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ 755 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో సొంతగడ్డపై తొలి 10 ఇన్నింగ్స్‌ల్లో 750కిపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌‌గా ఘనత సాధించాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన తొలి బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డు లిఖించాడు. ఇంతకుముందు సొంతగడ్డపై తొలి 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935లో అతను 747 పరుగులు చేశాడు. 89 ఏళ్ల తర్వాత జైశ్వాల్ అతన్ని అధిగమించడం గమనార్హం. కాగా, గతేడాది వెస్టిండీస్‌పై జైశ్వాల్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ రెండు డబుల్ సెంచరీలు(209, 214) బాదడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed