BJP : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ

by Hajipasha |
BJP : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించారు. కశ్మీరీ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొంటూ బీజేపీకి సాధ్యమైనన్ని ఎక్కువ అసెంబ్లీ సీట్లను సాధించాలని ఈసందర్భంగా పార్టీ నేతలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. 2014లో జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. ఆ టైంలో 28 సీట్లు సాధించిన పీడీపీ పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2018లో నాటి పీడీపీ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ చనిపోయాక మెహబూబా ముఫ్తీ పార్టీ పగ్గాలను చేపట్టారు. పీడీపీలో ఈ మార్పు జరిగిన అనంతరం సంకీర్ణ సర్కారు నుంచి బీజేపీ వైదొలిగింది. దీంతో అక్కడి పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed