బీహార్‌లో పోలీసుల దాష్టికం.. నియామ‌కాలు చేయ‌మంటే ర‌క్తం క‌ళ్ల చూశారు! (వీడియో)

by Sumithra |   ( Updated:2022-08-24 07:45:37.0  )
బీహార్‌లో పోలీసుల దాష్టికం.. నియామ‌కాలు చేయ‌మంటే ర‌క్తం క‌ళ్ల చూశారు! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః పాట్నాలో పోలీసులు రెచ్చిపోయారు. ఉత్తీర్ణుల‌య్యాం ఉద్యోగాలు భ‌ర్తీ చేయండీ బాబూ అని అడిగినందుకు బీహార్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (బిటిఇటి), సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సిటిఇటి) అభ్యర్థులపై పాట్నా పోలీసులు సోమవారం లాఠీఛార్జ్ చేశారు. జాతీయ జెండా ప‌ట్టుకొని, త‌న గోడు వెళ్ల‌బోసుకుంటున్న అభ్య‌ర్థుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి, ర‌క్తం క‌ళ్ల చూశారు. మీడియా నివేదికల ప్రకారం, టీచ‌ర్‌ ఉద్యోగ ఆశావాహులు పాట్నాలో రోడ్డెక్కారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా నిరుద్యోగులుగా ఉన్న‌మాని, నియ‌మ‌కాల గడువు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

2021లో జనవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారని, అది జరగలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు. దీని తర్వాత, అభ్య‌ర్థులు మే నెల్లో అనేక నిరసన కార్య‌క్ర‌మాలు చేశారు. జూలై నెలాఖరులోగా తమ డిమాండ్లు నెరవేరుతాయని అధికారులు మళ్లీ హామీ ఇచ్చారు. అయితే, జులైలో కూడా నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయ సంఘం మళ్లీ రోడ్డుపై బైఠాయించింది. ఈసారి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన విర‌మించేది లేదన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఆలస్యం చేసిన ప్రతిసారీ కొత్త సాకులు చెబుతోందని ఉపాధ్యాయ సంఘం నిల‌దీసింది.

Advertisement

Next Story

Most Viewed