కండోమ్స్ కూడా అడుగుతారన్న ఐఏఎస్ అధికారిణి.. సీఎం రియాక్షన్ ఇదే..

by Javid Pasha |
కండోమ్స్ కూడా అడుగుతారన్న ఐఏఎస్ అధికారిణి.. సీఎం రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ ఓ బాలికకు ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. బీహార్ ఉమెన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ మ్యానేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అయితే రాష్ట్రంలోని యువతులకు శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటు ధరల్లో ప్రభుత్వమే అందించడం జరుగుతుందా అని ఓ బాలిక ఇటీవల జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఐఏఎస్ అధికారిణి అడగగా.. ఆ ప్రశ్నకు హర్జోత్ ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది.

'ఇప్పుడు మీరు శానిటరీ ప్యాడ్స్ అడుగుతున్నారు. రేపు కండోమ్స్ అడుగుతారు' అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా హర్జోత్ తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. 'నేను ఏ బాలిక సెంటిమెంట్లను కించపరిచి ఉంటే నన్ను క్షమించండి. నేను ఎవరి అవమాన పరిచేందుకు, ఎవరి మనోభావాలను కించపరిచాలన్న భావన నాకు లేదు' అని, తన మాటలకు ఎవరి మనోభావాలనైనా గాయపడి ఉంటే అందుకు తాను చింతిస్తున్నానని ఆమె ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఆమె వ్యాఖ్యలు హెడ్‌లైన్స్‌గా మారడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్.. హర్జోత్ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని, ఇటీవల స్కూల్ బాలికకు ఆమెకు జరిగిన సంభాషణ తన ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేసిందని ఆయన అన్నారు. 'ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాల సహాయపడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఆ ఐఏఎస్ అధికారి ప్రవర్తన ఇందుకు విరుద్ధంగా ఉంటే ఆమెపై కచ్ఛితంగా చర్యలు తీసుకుంటాం' అని నితీష్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలి: మెగా స్టార్ కూతురు

Advertisement

Next Story

Most Viewed