- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bihar: మేకల దొంగతనం వివాదం కేసు.. 36 ఏళ్ల తర్వాత కీలక తీర్పు
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు మేకల దొంగతనం వివాదం కేసులో బీహార్ లో ఓ సివిల్ కోర్టు 36 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. ఔరంగాబాద్ ప్రాంతంలోని అస్లెంపూర్ గ్రామంలో రాజన్ రాయ్ అనే వ్యక్తి ఇంట్లో 1982 జూన్ 25 తెల్లవారుజామున దొంగలు పడి రెండు మేకలను చోరీ చేశారు. దీనిపై అనుమానం ఉన్న వారిని మేకల యజమాని రాజన్ వెళ్లి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి 12 మంది వ్యక్తులు రాజన్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టి పారిపోయారు. ఈ ఘటనలో భార్యపిల్లలతో ప్రాణాలతో బయటపడ్డ రాజన్ నిందితులపై దౌద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది కానీ కోర్టు ఎటువంటి తీర్పును వెళువరించలేదు. నిందితులుగా పేర్కొన్న వారిలో ఐదుగురు ఇప్పటికే మరణించగా.. మరో ఇద్దరిని గతంలోనే నిర్ధోషులుగా తేల్చింది. ఈ కేసులో సోమవారం ఔరంగాబాద్ సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ సౌరభ్ సింగ్ తీర్పునిచ్చారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాదారాలు లేకపోవడంతో నిందితులను నిర్ధోషులుగా ప్రకటించారు. దీంతో మరో ఐదుగురు కూడా నిర్ధోషులుగా బయటపడ్డారు.