- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమేథీ ఫ్యామిలీ మర్డర్ కేసులో ట్విస్ట్.. విచారణలో విస్తుపోయే నిజాలు
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఒక కుటుంబాన్ని (Amethi Family Murder) సైకో వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. గురువారం సునీల్ కుమార్, భార్య పూనమ్ భారతి, ఇద్దరు కూతుర్లను చందన్ వర్మ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. నలుగురికీ ఏడు బుల్లెట్లు తగిలినట్లు గుర్తించారు పోలీసులు. అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకోగా.. మిస్ ఫైర్ కావడంతో బ్రతికిపోయాడు. అక్కడి నుంచి పరారైన నిందితుడు.. ఢిల్లీకి ఉడాయిస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం నోయిడా పోలీసులు జెవార్ టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఒక తుపాకీ, మ్యాగజైన్, లైవ్ కాట్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబం హత్య వెనుక.. వివాహేతర సంబంధమే (Extra Marital Affair) ప్రధాన కారణమని పేర్కొన్నారు. నిందితుడు చందన్ వర్మ (Chandan Varma) పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖత్రానా మైదాన్ పూర్ రాయ్ బరేలీకి చెందిన తనకు సునీల్ కుమార్ భార్య పూనమ్ భారతితో ఏడాదిన్నర కాలంగా వివాహేతర సంబంధం ఉందన్నాడు. అది వికటించడంతోనే ఆగ్రహానికి గురై ఆ కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు తెలిపాడు.
చందన్.. పూనమ్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని వారి సన్నిహితురాలు ఒకరు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ పూనమ్ అందుకు నిరాకరించిందని, చందన్ తో శారీరక బంధాన్ని మాత్రమే కోరుకుందని తెలిసి.. చందన్ కు కోపం వచ్చిందని చెప్పింది.
నిందితుడి వాట్సాప్ (What's App)ను చూడగా.. స్టేటస్ లో సెప్టెంబర్ 12న.. 5 గురు చనిపోతారు. నేను మీకు త్వరలోనే చూపిస్తాను అని రాసి ఉంది. ఈ వాట్సాప్ స్టేటస్ వైరల్ అవ్వడంతో.. అతను ఎప్పటి నుంచే ఈ హత్యలకు ప్లా్న్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత.. చందన్ కూడా చనిపోయినట్లు వార్తలొచ్చాయి. తర్వాత అతను టోల్ ప్లాజా వద్ద కనిపించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. పూనమ్, చందన్ లు కలిసి ఉన్న ఫొటోలను ఎవరు వైరల్ చేశారన్నది పెద్ద ప్రశ్న. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.