BIG BREAKING: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు

by Shiva |   ( Updated:2024-08-05 12:43:03.0  )
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. వర్గీకరణ అంశం ఆర్టికల్ 341/2కి ఉల్లంఘన కాదని సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్టమైన విధానాలను తీసుకురావాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పిటిషన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు సార్లు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఈ పరిణామంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబురాలు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story