RAIN EFFECT: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 80 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

by Anjali |
RAIN EFFECT: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 80 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
X

హైదరాబాద్: గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో ఇళ్లన్ని వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లన్ని తెగిపోతున్నాయి. ఈ భారీ వర్షం కారణంగా రవాణా రంగం కూడా రిస్క్‌లో పడింది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. కాగా దక్షిణ రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఏకంగా 80 ట్రైన్స్‌ను రద్దు చేసింది. ఈ సందర్భంగా దక్షిణ రైల్వే అధికారులు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికన తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను మళ్లించారని పేర్కొంది. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారని వెల్లడించింది. దీనిపై రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ స్పందించి.. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రయాణికుల సేఫ్టీ కోసమే రైళ్లను రద్దు చేస్తున్నామని తెలిపారు.

రద్దైన రైళ్ల వివరాలు చూసినట్లైతే...

విజయవాడ - సికింద్రాబాద్

గుంటూరు - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - విజయవాడ

కాకినాడ ఫోర్ట్ - లింగపల్లి

సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్

గూడూరు - సికింద్రాబాద్

బల్హర్ష- కాజీ పేట్

భద్రాచలం - బల్హర్ష

సికింద్రాబాద్ - భద్రాచలం

భద్రాచలం - సికింద్రాబాద్

హైదరాబాద్ - షాలిమర్

కాజీ పేట - డోర్నకల్

విశాఖ పట్నం - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - విశాఖ పట్నం

సికింద్రాబాద్ - తిరువనంతపురం

హౌరా - సికింద్రాబాద్

కరీంనగర్ - తిరుపతి

మహబూబ్ నగర్ - విశాఖ పట్నం

తిరువనంతపురం - సికింద్రాబాద్

CMT ముంబాయి - లింగంపల్లి

లింగంపల్లి - CMT ముంబాయి

Advertisement

Next Story

Most Viewed