- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండోర్‌లో ‘నోటా’కు జై కొడుతున్న కాంగ్రెస్.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో నోటాకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇండోర్ స్థానానికి నాలుగో దశలో మే 13న ఓటింగ్ జరగనుంది.బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ బరిలో ఉన్నారు. నోటాకు ఓటు వేయమని ప్రజలను కోరే పరిస్థితి కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చిందంటే.. ఆ పార్టీ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నామినేషన్ వెనక్కి తీసుకున్నారు అక్షయ్. ప్రస్తుతం ఆ స్థానంలో వేరే అభ్యర్థిని బరిలోకి దింపేందుకు హైకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అక్షయ్ వెంటనే బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థి లేకుండా పోయారు. ఇండోర్ నియోజకవర్గాన్ని గత 35 ఏళ్లల్లో కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1989 నుంచి అక్కడ ఒక్కసారి కూడా కాంగ్రెస్ గెలవలేదు. అయితే, అభ్యర్థిని కూడా బరిలో నిలపకపోవడం ఇదే తొలిసారి.
ప్రముఖ నేతల స్పందన ఇలా..
నోటాకు ఓటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సజ్జన్ వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని దొంగిలించారని.. వారికి గుణపాఠం చెప్పేందుకు నోటాకు ఓటేయాలని అన్నారు. బీజేపీ అన్యాయంగా అక్షయ్‌ను ప్రలోభపెట్టి ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓఝా పేర్కొన్నారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి తగిన సమాధానం చెప్పాలని కోరారు.
నోటాకు ఓట్లు వేయాలంటూ
కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా శోభా ఓఝా అభివర్ణించారు. నోటాకు ఓటు వేయాలని కోరుతూ ఆటోపై అంటించిన ఓ పోస్టర్‌ను బీజేపీ నేత సంధ్యా యాదవ్ చింపేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. నోటాను నొక్కమని ప్రజలను ప్రేరేపించడం నేరమని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ అన్నారు. ఇండోర్ నుంచి ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికైన మరో బీజేపీ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నోటా ప్రచారాన్ని సమర్ధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం అన్యాయమని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరితే .. తమ పార్టీ ఏమీ చేయలేదని సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న శంకర్ లాల్వానీకి ఓటేయాలని ప్రజలను కోరారు.