- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పట్టువదలని విక్రమార్కుడు.. 300 అప్లికేషన్స్, 500 ఈ-మెయిల్స్’..చివరికి ఏమైందంటే?
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత పోటి ప్రపంచంలో ఉద్యోగం సాధించడం కత్తిమీద సామే.. అయినప్పటికి నేటి తరం యువత ఉద్యోగాల వేటలో దూసుకెళ్తున్నారనడంలో సందేహం లేదు. ఉద్యోగం సాధించాలనే గట్టి సంకల్పం తో యువత ముందుకు అడుగులు వేస్తోంది. తాము ఎంచుకున్న రంగంలో బెటర్ జాబ్ సాధించాలనే తపనతో యువత పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో అమెరికాలో జాబ్ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటోంది. దీని కోసం ఎంతగానో కృషి చేస్తారు. ఇక అమెరికాలో ఉద్యోగం కోసం మన భారతీయులు పడే కష్టనష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే ఆటోమొబైల్ కంపెనీల్లో ముందంజలో ఉంటుంది.
టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు జనం ఎంత ఆసక్తి చూపుతారో.. ఆ కంపెనీలో జాబ్ చేసేందుకు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో పుణేకు చెందిన ధ్రువ్ లోయా అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి సోషల్ మీడియాలో వైరలవుతోంది. యూఎస్ లోనే చదువుకున్న అతను జాబ్ కోసం 5 నెలల్లో 300 దరఖాస్తులు, 500కు పైగా ఈ-మెయిల్స్ పంపారు. 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరవగా ఎట్టకేలకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించారు. ఈ విషయాన్ని అతను linkedin లో పోస్టు చేయగా అందరూ అభినందిస్తున్నారు.