Elon Musk : మస్క్‌పై బెర్లిన్ సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |
Elon Musk : మస్క్‌పై బెర్లిన్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : జర్మనీ ఎన్నికలను ప్రభావితం చేయాలని ‘ఎక్స్’, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నట్లు బెర్లిన్ ప్రభుత్వ మహిళా అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఎలన్ మస్క్ ఫెడరల్ ఎన్నికలను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలని చూస్తున్నారని.. ఇటీవల ‘ఎక్స్’ వేదికగా ఆయన రైట్ వింగ్ అల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి మద్దతుగా వ్యాసాలు రాసినట్లు ఆమె తెలిపారు. మస్క్‌కు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని.. కానీ కొన్ని సందర్భాల్లో అది నాన్‌సెన్స్‌గా మారే అవకాశం ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ‘ఏఎఫ్‌డీ మాత్రమే జర్మనీని రక్షించగలదు’ అని మస్క్ వ్యాసం రాసినట్లు ఆమె తెలిపారు. పన్నుల నియంత్రణ, మార్కెట్ సడలింపు వంటి పార్టీ విధానాలను మస్క్ ప్రశంసించినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఛాన్స్‌లర్ ఒలాఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల జర్మనీలో కూలిపోయింది. దీంతో ఫిబ్రవరి 23న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి.. ఇటీవల యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంలో మస్క్‌‌ కీలక పాత్ర పోషించాడు. 120 మిలియన్ల డాలర్లను ట్రంప్ కోసం విరాళంగా అందజేశారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ మస్క్‌ను తన పరిపాలన విభాగంలో అడ్వైజర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed