బెంగళూరులో 15కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు

by Prasanna |   ( Updated:2023-12-01 06:43:33.0  )
బెంగళూరులో 15కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు
X

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. అనామక ఈ-మెయిల్ నుంచి ఈ బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 15కి పైగా పాఠశాలలకు ఈ రకమైన బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. మొదట బసవేశ్వర్ నగర్‌లోని విద్యాశిల్ప సహా ఏడు పాఠశాలలకు బెదిరింపులు రాగా, వాటిలో ఒక పాఠశాల కర్ణాటక ఉప-ముఖ్యమంత్రి డీకె శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరికొన్ని పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా పాఠశాలల నుంచి విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపులు బూటకమని సందేహాలు ఉన్నప్పటికీ, పోలీసులు బాంబు స్క్వాడ్‌ల సహాయంతో అన్ని పాఠశాలల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. గతేడాది సైతం బెంగళూరులోని చాలా పాఠశాలలకు ఇటువంటి బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి.

Advertisement

Next Story