- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలతో జలమయమైన బెంగళూరు నగరం
దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(low pressure) తీవ్రతరం కావడంతో పాటు తుఫానుగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు పట్టణం(Bengaluru city)లో నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో మహానగరం బెంగళూరు దక్షిణ ప్రాంతంలో అనేక కాలనీలు జలమయం(flooded) అయ్యాయి. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో యలహంకలోని కేంద్రీయ సదన్ పూర్తిగా జలమయం అయింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్(NDRF), ఎస్డీఆర్‌ఎఫ్(SDRF) సహాయక బృందాలు.. పడవల్లో వరద బాధితులను బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తుండటంతో.. జనజీవన స్తంభించి పోయిందని స్థానిక ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదిలా ఉంటే అల్పపీడనం కాస్త తుఫాను(storm)గా మారడంతో.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) అలర్ట్ జారీ చేయడంతో.. నగర ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.