- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరగతి గదిలోకి తుపాకీతో చొరబడ్డ వ్యక్తి..
by Vinod kumar |
X
మాల్దా: ఓ గుర్తు తెలియని వ్యక్తి మాల్దా జిల్లా ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో చొరబడ్డాడు. అయితే పోలీసులు అతనిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఓల్డ్ మాల్దాలోని ముచియా ఆంచల్ చంద్ర మోహన్ హై స్కూలులో ఈ భయానక దృశ్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ చూపిస్తూ కేకలు వేయడం ప్రారంభించాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
‘ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి 8వ తరగతి గదిలోకి దూసుకెళ్లాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. గట్టిగా కేకలు వేస్తూ క్లాస్ టీచర్‌ను చంపుతానని బెదిరించాడు’ అని ఆ అధికారి చెప్పారు. అయితే వెంటనే అతడిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత క్లాస్‌లను రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story