Bangladesh: అనుమానాస్పద రీతిలో బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మృతి

by S Gopi |
Bangladesh: అనుమానాస్పద రీతిలో బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని బెంగాలీ శాటిలైట్, కేబుల్ టెలివిజన్ ఛానెల్‌ గాజీ టీవీ న్యూస్‌రూమ్ ఎడిటర్ సారా రహనుమా అనుమానాస్పదంగా మరణించారు. ఢాకాలోని హతిర్‌జీల్ సరస్సులో ఆమె శవమై కనిపించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్థానికులు ఆమె మృతదేహాన్ని గుర్తించి ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (డీఎంసీహెచ్)కి తరలించారు. అయితే, ఆమె మృతికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియరాలేదని బంగ్లా మీడియా చెబుతోంది. ఇది హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎంసీహెచ్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా చెప్పారు. సారా రహనుమా ఆఫీసుకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త చెప్పారు. సారా రహనుమా చనిపోవడానికి ముందు మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో తన స్నేహితుడికి బదులిస్తూ అనుకున్నవి జరగలేదు, అందుకు క్షమించాలని అన్నారు. అంతకుముందు 'చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం.' అని పోస్ట్‌లో రాశారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన క్రూరమైన దాడి అని సంభోధించారు.

Advertisement

Next Story

Most Viewed