Bajrang Punia : బజ్రంగ్ పునియాకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి

by Hajipasha |
Bajrang Punia : బజ్రంగ్ పునియాకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాకు కీలక అవకాశం దక్కింది. ఆయనను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈమేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్‌లో చేరే ముందు నార్తెర్న్ రైల్వేలోని తన ఉద్యోగానికి పునియా రాజీనామా చేశారు. ఇకపై తాను రైతులు, అథ్లెట్లు, కార్మికులు విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతానని ఆయన ప్రకటించారు. అన్యాయంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉందని బజ్రంగ్ పునియా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed