- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. అరుణ్ పిళ్లైకి బెయిల్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ (Hyderabad) బిజినెస్‌మ్యాన్ అరుణ్ రామచంద్ర పిళ్లై (Ramachandra Pillai)కి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కీలక ఆదేశాలు జారీ చేసింది. పిళ్లై దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (Bail Petetion)పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్‌నకు చెందిన బీఆర్ఎన్ నేత కే. కవిత (BRS leader K. Kavita), మాగుంట రాఘవ్, గోరంట్ల బుచ్చిబాబు, పీ శరత్ రెడ్డి, బోయిన్‌పల్లి అభిషేక్, బినోయ్ బాబులతో పాటు అరుణ్ పిళ్లై కూడా కీలక నిందితుడిగా ఉన్నాండంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం దీనికి సంబంధించి రూ.100 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయంటూ కేసు నమోదు చేసిన ఈడీ (Enforcement Directorate).. మనీ లాండరింగ్ కేసులో మార్చి 6వ తేదీన అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసింది.