ప్రధాని మోడీ బర్త్ డే రోజున.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముమ్మర ప్రచారం

by Vinod kumar |
ప్రధాని మోడీ బర్త్ డే రోజున.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముమ్మర ప్రచారం
X

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా సెప్టెంబరు 17న ‘ఆయుష్మాన్ భవ’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ప్రత్యేక సంక్షేమ పథకాల ద్వారా ఆరోగ్య, ఆహార రంగాలకు ప్రధాని చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ఆ రోజున ఆయుష్మాన్ భవ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తామని సోమవారం వెల్లడించారు. దేశంలోని 60 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల విలువైన వైద్య సహాయాన్ని అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ ను అమలు చేసిన ఘనత మోడీకే దక్కుతుందని తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ స్కీం వల్ల ఎంతోమంది పేద, అణగారిన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ‘ఆయుష్మాన్ భవ’ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 17న దేశం అంతటా ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ 3.0, ఆయుష్మాన్ మేళా, ఆయుష్మాన్ సభ పేరుతో మూడు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి 60 వేల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed