Awadhesh: అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు: ఎంపీ అవధేష్ ప్రసాద్

by vinod kumar |
Awadhesh: అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు: ఎంపీ అవధేష్ ప్రసాద్
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య(Ayodya)లో నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని సమాజ్ వాదీ పార్టీ (SP) నేత, ఫైజాబాద్ (Faizabad) ఎంపీ అవదేష్ ప్రసాద్ (Awadhesh prasad) ఆరోపించారు. పండుగలను సైతం బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన లక్నో(Laknow)లో మీడియాతో మాట్లాడారు. ‘దీపావళి(Diwali) సందర్భంగా అయోధ్య ప్రజలందరినీ నా శుభాకాంక్షలు. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ఈ పండుగ ఏ ఒక్క సంఘానికీ చెందినది కాదు. దీపోత్సవ్ కార్యక్రమం కోసం నాకు ఎటువంటి ఇన్విటేషన్ అందలేదు’ అని తెలిపారు. ఎలాంటి ఆహ్వానం అందనప్పటికీ, తాను తన నియోజకవర్గానికి వెళ్తానని.. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదని చెప్పారు. కాగా, అయోధ్య రామాలయం ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే బుధవారం ఉత్తరప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి అవదేష్‌ను ఆహ్వానించలేదు. మరోవైపు దీపావళి సందర్భంగా యూపీ ప్రభుత్వం సరయూ నది ఒడ్డున (sarayoo river) 28 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story