- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ChatGPT : ఏఐతో స్నేహం.. రోడ్డునపడ్డ కుటుంబం.. అసలేం చెప్పిందో తెలిస్తే గుండె ఆగడం ఖాయం!

దిశ, ఫీచర్స్ : ఏఐతో స్నేహం కొన్నిసార్లు మంచి చేస్తే.. కొన్నిసార్లు చెడు కూడా తప్పదు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పరువును తీసింది. ఏకంగా కొడుకులను మర్డర్ చేశాడని హత్యారోపణలు చేసింది. దీంతో అతను పరువునష్టం దావా వేసి.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అవును.. ఇద్దరు పిల్లల తండ్రి తన కుమారులను హత్య చేశాడని, ఇందుకుగాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చాట్‌బాట్ తప్పుగా పేర్కొనడంతో.. చాట్‌జీపీటీ కంపెనీ ఓపెన్‌ఏఐపై నార్వేజియన్ వ్యక్తి అర్వే హ్జల్మార్ హోల్మెన్ దావా వేశాడు. సాధారణ వ్యక్తి అయిన ఆయన తన గురించి చాట్ జీపీటీ ఏం చెప్తుందోననే ఉత్సాహంతో అడగ్గా.. ఈ సమాధానం రావడంతో షాక్ అయ్యాడు.
‘‘అర్వే హ్జల్మార్ హోల్మెన్ ఎవరు?’’ అని చాట్‌బాట్‌ను ప్రశ్నించగగా.. ‘‘ఒక విషాద సంఘటన కారణంగా అందరి దృష్టిని ఆకర్షించిన నార్వేజియన్ వ్యక్తి. అతను డిసెంబర్ 2020లో నార్వేలోని ట్రోండ్‌హీమ్‌లోని వారి ఇంటికి సమీపంలోని చెరువులో విషాదకరంగా చనిపోయి కనిపించిన ఏడు, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకుల తండ్రి. ఆ దారుణమైన నేరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హోల్మెన్ ఈ నేరానికి పాల్పడ్డాడు. 21 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది’’ అని సమాధానమిచ్చింది. పూర్తిగా తప్పుడు సమాచారంతో తీవ్రంగా కలత చెందిన ఆయన.. దీనిపై నార్వేజియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. పరువు నష్టం కలిగించే ChatGPT ప్రతిస్పందన GDPR యూరోపియన్ డేటా చట్టంలోని ఖచ్చితత్వ నిబంధనలను ఉల్లంఘిస్తుందని... దాని నమూనాను సర్దుబాటు చేయడానికి, తప్పుడు ఫలితాలను తొలగించడానికి ChatGPT, OpenAIలను ఆదేశించాలని నార్వేజియన్ వాచ్‌డాగ్‌ను కోరాడు.
షాకింగ్ విషయం ఏమిటంటే ChatGPT చెప్పిన కథలో అర్వ్ హ్జల్మార్ హోల్మెన్ జీవితాన్ని పోలిన అంశాలు ఉన్నాయి. ఇది నార్వేజియన్ వ్యక్తి స్వస్థలం, అతనికి ఉన్న పిల్లల సంఖ్య, పిల్లల మధ్య వయస్సు అంతరం గురించి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇది కనుక తన గ్రామంలో, బంధువుల్లో తెలిస్తే తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపవచ్చని ఆందోళన చెందాడు.