CM Bungalow : ఎట్టకేలకు అతిషికి ఢిల్లీ సీఎం బంగ్లా కేటాయింపు

by Hajipasha |
CM Bungalow : ఎట్టకేలకు అతిషికి ఢిల్లీ సీఎం బంగ్లా కేటాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అధికారిక నివాసం కేటాయింపుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఎట్టకేలకు ఢిల్లీ సివిల్ లైన్స్ ఏరియాలోని ప్రభుత్వ బంగ్లాను సీఎం అతిషికి కేటాయిస్తూ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) డిప్యూటీ సెక్రెటరీ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అధికారిక బంగ్లాలో నివసించేందుకు సమ్మతి తెలుపుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైన ఎనిమిది రోజుల్లోగా ముఖ్యమంత్రి అతిషి తమకు సమాధానం ఇవ్వాలని పీడబ్ల్యూడీ విభాగం కోరింది. సీఎం అధికారిక నివాసంలోకి మారిన 15 రోజుల్లోగా.. ఇప్పటివరకు ఎమ్మెల్యే హోదాలో నివసించిన బంగ్లాను ఖాళీ చేయాలని సూచించింది.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీ సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో సీబీఐ, పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఇదే నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి దాడికి పాల్పడ్డారనే కేసుకు సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఒకవేళ అవసరమైతే ఈ విచారణలకు సహకరించాలని సీఎం అతిషిని పీడబ్ల్యూడీ విభాగం కోరడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed