- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడులో ఆ పార్టీతో మజ్లిస్ పొత్తు
దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొనడమే ధ్యేయంగా తమిళనాడులో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈవిషయాన్ని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం ప్రకటించారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఓటర్లలో దాదాపు 5 శాతం మంది ముస్లింలే. బీజేపీని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే.. భవిష్యత్తులోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేస్తోంది. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చట్టాలను వ్యతిరేకిస్తామని మజ్లిస్‌కు అన్నాడీఎంకే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంఎల్, వీసీకే, కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం పార్టీ, ఎండీఎంకే, గౌండర్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. దీనికి డీఎంకే పార్టీ సారథ్యం వహిస్తోంది.